Header Banner

మంగళగిరి నిధి భవన్​లో అగ్ని ప్రమాదం! పరుగులు తీసిన ఉద్యోగులు!

  Wed May 21, 2025 18:05        Others

భవన్​లోని సెంట్రల్​ ఏసీలో విద్యుదాఘాతంతో పొగలు - విధులకు వచ్చిన 500 మంది ఉద్యోగులు ప్రాణభయంతో పరుగులు.మంగళగిరిలో రాష్ట్ర ఆర్థిక శాఖకు గుండెకాయ లాంటి నిధిభవన్​లో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ భవనంలో ఖజానా, వర్క్ అకౌంట్స్, పే అండ్ అకౌంట్స్, స్టేట్ ఆడిట్, ఏపీసీఎఫ్​ఎస్​ఎస్, ఎంఏపీజీఎల్​ఐ విభాగాలున్నాయి. ఐదంతస్తులున్న నిధి భవన్​లోని రెండో అంతస్తులోని విద్యుదాఘాతంతో క్షణాల్లో దట్టమైన పొగ వ్యాపించింది. అప్పటికే విధులకు వచ్చిన సుమారు 500 మంది ఉద్యోగులు ప్రాణభయంతో కిందకు పరుగులు తీశారు.

 

ప్రమాద విషయాన్ని తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. భవనం అద్దాలు పగలగొట్టి పొగ బయటకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. నిధిభవన్​లో ఫైర్ సేఫ్టీ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఉద్యోగులు చెప్పారు. విద్యుదాఘాతంతో ఏర్పడిన పొగతో కంప్యూటర్లు పాడవుతాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమైన చెల్లింపులకు సంబంధించిన దస్త్రాలన్నీ ఈ కార్యాలయంలోనే ఉన్నాయని ఉద్యోగులు చెప్పారు.

 

ఇది కూడా చదవండి: జూన్ 21న ఏపీలో ఒక చరిత్ర సృష్టించబోతున్నాం..! సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

5 ఫోర్లలో ఉన్న ఉద్యోగులను వెంటనే అప్రమత్తం చేసాం. విద్యుత్​ షార్ట్​సర్క్యూట్​ వల్లే మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బందికి వెంటనే సమాచారం అందించాం. అగ్నిమాపక దళం మంటలను అదుపుచేశారు. కొన్ని ఫైళ్లు కాలిపోయే ఆస్కారం ఉందని అనుకుంటున్నాం. సోమవారం ఏజీ వర్క షాప్​ నడిచింది. దానికి సంబంధించిన ఫైళ్లు అక్కడే ఉన్నాయి. ఎటువంటి ప్రాణానష్టం జరగలేదు. కానీ కంప్యూటర్లు, హార్డ్ డిస్క్​లు, సీపీయూలు, మానిటర్లు ఎంతమేరకు డ్యామేజ్​ అయ్యాయో తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం ఉదయం 10:40 గంటలకు జరిగింది. -సీవీ రమణ, ఏపీఏఫ్​.

 

మేము ఉదయం 10 గంటలకు ఆఫీసుకు వచ్చాం. పనిలో అందరూ నిమగ్నమై ఉండగా, పీఈవో ఛాంబర్​ నుంచి మంటలు వచ్చాయి. ఆపై మంటలు వ్యాపించాయి. అన్ని ఫైళ్ల ఆన్​లైన్​లు ఉండడం వల్ల మాన్యువల్​గా ఎంత నష్టం జరిగిందో తెలియడం లేదు. ఫైర్​ సేఫ్టీ మేథడ్స్​​ ఉంటే బాగుండేది. అవి లేకపోవడం వల్లే ఇంతటి ప్రమాదం జరిగింది. దాదాపుగా 400 నుంచి 500 మంది ఉద్యోగులు రోడ్డు పైనే ఉన్నారు. మంటలను ఆర్పుతున్నారు. భవిష్యత్​లో అయినా ఫైర్​ సేప్టీ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. అన్ని ఫోర్లకు పొగలు దట్టంగా వ్యాపించాయి. చుట్టూ అద్దాలు ఉండడం వల్ల గాలి వెళ్లే పరిస్థితి లేదు. మొదటగా మంటలు సెకండ్​ ఫోర్లలో వచ్చాయి. దాంతో ఇతర ఫోర్లకు వెళ్లే పరిస్థితి లేదు. - వెంకటేశ్వర రెడ్డి. ఉద్యోగి

 

మంగళగిరి నిధి భవన్​లో అగ్ని ప్రమాద ఘటనపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆరా తీశారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారుల్ని వివరణ కోరారు. ప్రమాదం ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి స్వయంగా ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించనున్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే వార్త.. కొత్తగా కేబుల్ బ్రిడ్జ్! ఈ రూట్ లోనే ఫిక్స్ - ఆ నేషనల్ హైవేకు దగ్గరగా.!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

 ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

 

 అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ పై మంత్రివర్గ కీలక నిర్ణయాలు! ఇక నుండి ఇలా...!

 

 టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!

 

నేడు (21/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్..! వచ్చే నెల నుంచి ఆ రూల్ రద్దు?

 

 రేషన్ పంపిణీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! జూన్ నుంచి ఇలా..!

 

ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఆపరేషన్ వైసీపీ! నెక్స్ట్ వికెట్..!

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

వారిని అభినందించిన లోకేష్.. ఏపీలో విద్యాసంస్కరణలపై దేశ వ్యాప్తంగా..

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

ఎవ్వరూ మాట్లాడొద్దు..! లిక్కర్ స్కాంపై సీఎం ఆర్డర్స్!

 

ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో భూసేకరణ! ఇక 8 గంటల్లో విశాఖ!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Mangalagiri #NidhiBhavan #FireAccident #AndhraPradesh #BreakingNews #Emergency